ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే సూపర్‌సిక్స్ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్ర వాస్తవ అప్పులు రూ.4.6 లక్షల కోట్లు అని ప్రభుత్వమే తేల్చింది. మరి అలాంటప్పుడు సూపర్‌సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు?అని మాజీమంత్రి రోజా ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ.... ఇది కచ్చితంగా సీఎం చంద్రబాబు అసమర్థతే. లోకేష్ కాలర్ పట్టుకుంటే తప్ప పథకాలు అమలు కావా?. ఇంత జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? అన్నింటికీ తన బాధ్యత అని చెప్పిన ఆయన, ఇప్పుడు తప్పించుకుంటే ఎలా?అని మండిపడ్డారు.
అలానే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజులు, స్కాలర్‌షిప్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. పెండింగ్‌లో పెట్టిన రూ.3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అందుకు ఫిబ్రవరి 5 డెడ్‌లైన్. ఆలోగా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు, స్కాలర్‌షిప్ చెల్లించకపోతే, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. విద్యార్థులకు అండగా నిల్చి పోరాడుతాం.విద్యార్థుల ఫీజు (విద్యాదీవెన) కింద రూ.2800 కోట్లు, స్కాలర్‌షిప్ (వసతిదీవెన) కింద మరో రూ.1100 కోట్లు.. రెండూ కలిపి మొత్తం రూ.3900 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. వాటిని వెంటనే చెల్లించకపోతే నిరసనలకు దిగుతాం అని తెలిపారు.