అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.... ‘నాకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా అవకాశం ఇచ్చిన వైయస్ జగన్‌కు ధన్యవాదాలు. అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందని నూకాంభిక అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నాను.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైయస్ఆర్‌సీపీ లక్కు.. అంబటి రాంబాబు అంటే వైయస్ఆర్‌సీపీలో కిక్కు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడు. మోసం చేసిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి’ అని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ పిలుపునిచ్చారు.