మంత్రి నిర్మలా సీతారామన్ పట్టణ పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం (UPI) యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు తీసుకురాబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు.
పట్టణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో కార్డు చెల్లింపుల కంటే యూపీఐ చెల్లింపులు వేగంగా పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.