ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మక అవార్డు- 2024కు జిల్లా ఎంపిక కావాలని, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పీఎం ఎక్స్ లెన్సీ అవార్డు, సూర్యఘర్ యోజనపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు.