ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఏపీ వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. నిన్న పురుషుల విభాగం 67 కిలోల కేటగిరీలో రాష్ట్రానికి చెందిన కె. నీలం రాజు స్వర్ణ పతకం సాధించగా... నేడు మహిళల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్. పల్లవి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ పల్లవి అని అభినందనలు తెలిపారు. విజయనగరం నుంచి వచ్చిన మన రాష్ట్ర పుత్రిక 71 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచింది అని వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.