ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాయ్‌ చెప్పిన రిషి సునాక్‌.. నమస్తే పెట్టాలన్న అత్త

international |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 10:28 PM

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి-సుధామూర్తి దంపతుల అల్లుడు, బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్‌ శనివారం జైపుర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. తన సతీమణి అక్షతామూర్తితో కలిసి రిషి సునాక్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి హాజరైన వారికి రిషి సునాక్‌ కూర్చొని అభివాదం చేస్తుండగా.. సుధామూర్తి సోదరి సునందా కులకర్ణి.. రిషి సునాక్‌ను వారించి.. పైకి లేచి అందరికీ నమస్కారం చేయాలని సూచించారు. దీంతో వెంటనే పైకి లేచిన రిషి సునాక్ అందరికీ నమస్కారం చేశారు. ఆ తర్వాత అంతా సరదాగా నవ్వుకున్నారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com