సచిన్ టెండుల్కర్ బీసీసీఐ జీవితకాల పురస్కారాన్ని అందుకున్నారు. 1994లో ప్రారంభమైన ఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఇప్పటివరకు 30 మంది క్రికెటర్లకు అందజేశారు. టెండుల్కర్ 31వ విజేతగా నిలిచారు. 1989లో 16 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టెండుల్కర్ 24 సంవత్సరాల పాటు భారత జట్టుకు సేవలందించారు. 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచిన ఆయన టెస్టుల్లో 15,921 పరుగులు, వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. భారత్ తరఫున ఒకే ఒక్క టీ20 మ్యాచ్ 2006లో దక్షిణాఫ్రికాతో ఆడారు.