2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో మరణించిన మాజీ కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రి సతీమణి జాకియా జాఫ్రి (86) శనివారం కన్నుమూశారు. గుల్బర్గ్ సొసైటీలో మరణించిన 69 మందిలో ఎహసాన్ ఒకరు. గోద్రా రైలు దహనం అనంతరం జరిగిన ఈ ఘర్షణలపై జాకియా సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేశారు. ఉన్నత స్థాయి రాజకీయ నాయకులను జవాబుదారీ చేయడం కోసం ఆమె అవిశ్రాంతంగా పోరాడారు.