పెడన పట్టణంలోని 5వ వార్డ్ లో గల హిందూ స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అభివృద్ధి పరచి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ని స్థానికులు ఆదివారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పెడన పట్టణంలోని హిందూ స్మశాన వాటికను అభివృద్ధి పరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్మశాన వాటిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.