AP: జీవీఎంసీలో టీడీఆర్‌ల పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖ జనసేన కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రూ.100 కోట్ల అక్రమ టీడీఆర్‌లు పొందిన వారు.. ఇప్పుడు వాటిని దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. డి-పట్టా, దేవస్థానం భూములకు వైసీపీ హయాంలో అక్రమంగా ఎన్నో టీడీఆర్‌లు ఇచ్చారని, అక్రమ టీడీఆర్‌లను రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.