బొమ్మూరులోని నేతాజీనగర్ లో చేపడుతున్న అభివృద్ది పనులను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం పరిశీలించారు. సీసీ రోడ్లను ఆయన పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను గోరంట్ల దృష్టికి తీసుకువచ్చారు. మండల టీడీపీ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.