చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారి పుల్లూరు క్రాస్ రోడ్ పరిధిలో టాటా ఏసీ బోల్తా పడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం మేరకు… ఎస్‌ఆర్ పురం మండలంలోని పాతపాలెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఎట్టేరికి గ్రామానికి టాటా ఏసీ వాహనంలో వెళుతుండగా మార్గమధ్యంలో టాటా ఏసీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలోని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయినట్టు సమాచారం. గాయపడినవారిని ఎస్‌ఆర్ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 108 ఆలస్యం కావడంతో స్థానికులు అసహనానికి గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.