సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్, భారతరత్న పురస్కారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం హిందూపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పద్మభూషణ్ రావడం కన్నా.. నాన్న ఎన్టీఆర్‌కు భారతరత్న రావటమే ముఖ్యమని బాలకృష్ణ అన్నారు. అదే కోట్లాది మంది తెలుగు ప్రజల కోరిక అని బాలయ్య తెలిపారు. ఎన్టీఆర్‍కు భారతరత్న అవార్డు కచ్చితంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కోసం తెలుగుప్రజలు ఎప్పటికైనా దీనిని సాధిస్తారని బాలయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.