వయసు పెరగడం, జెనెటిక్స్, హార్మోనల్ చేంజెస్, లైఫ్‌స్టైల్ ఈ కారణాలన్నింటి వల్ల చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోంది. ఈ తెల్ల జుట్టు కారణంగా చిన్నతనంలోనే పెద్దవారిలా కనిపిస్తారు. అయితే, ఇలాంటివాటన్నింటికీ పోషకాహారంతో చెక్ పెట్టొచ్చు. మన డైట్‌లో మంచి పోషకాలు తీసుకుంటే మొత్తం ఆరోగ్యానితో పాటు, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అదనంగా, వయసు పెరగడం వల్ల జుట్టు తెల్లబడడాన్ని తగ్గించుకోవచ్చు. అలాంటి జుట్టు తెల్లబడడాన్ని తగ్గించే విటమిన్స్, మినరల్స్ ఫుల్ జ్యూస్ గురించి తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పాలకూర
క్యారెట్స్
బీట్‌రూట్స్
ఉసిరి
అల్లం
నిమ్మరసం
పుదీనా ఆకులు
కొబ్బరినీరు
పాలకూర
పాలకూరలో ఐరన్, విటమిన్స్ ఎ, సిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పెంచి జుట్టుని పెరిగేలా చేస్తాయి. ఐరన్ లోపం కారణంగా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. కాబట్టి, ఈ జ్యూస్‌కి పాలకూర చాలా ముఖ్యం.
క్యారెట్స్
క్యారెట్స్‌లో బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి బాడీలో విటమిన్ ఎ లా పనిచేస్తాయి. విటమిన్ ఎ సెబమ్ ప్రొడక్షన్‌కి చాలా మంచిది. దీని వల్ల స్కాల్ప్ హెల్దీగా మారుతుంది. స్కాల్ప్‌పై డ్రైనెస్ తగ్గుతుంది. దీని వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడాన్ని తగ్గించుకోవచ్చు.
బీట్‌రూట్స్
బీట్‌రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా, విటమిన్ సి. ఇది కొల్లాజెన్ ప్రొడక్షన్‌లో కీ రోల్ పోషిస్తుంది. కొల్లాజెన్ అనేది జుట్టు బలానికి జుట్టు నల్లగా మారడానికి చాలా మంచిది. దీనిని తీసుకోవడం జుట్టు తెల్లబడడం తగ్గుతుంది.
ఉసిరి
ఉసిరి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌కి పవర్‌ఫుల్ హౌస్ అని చెప్పొచ్చు. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. పైగా జుట్టు త్వరగా తెల్లబడడాన్ని తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది.
అల్లం
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీని వల్ల స్కాల్ప్ కండీషన్ మెరుగ్గా ఉంటుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. ముఖ్యంగా, తెల్లబడడాన్ని తగ్గించుకోవచ్చు.
నిమ్మ
నిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మొత్తం జుట్టు ఆరోగ్యాన్నే కాపాడుకోవచ్చు. దీంతో పాటు త్వరగా తెల్లబడడాన్ని తగ్గించుకోవచ్చు.
పుదీనా
పుదీనా ఆకుల్ని ఎవరైనా కూడా ఎక్కువగా రీఫ్రెషింగ్ ఫీలింగ్ కోసం వాడతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జ్యూస్‌కి యాడ్ అవుతాయి. నిమ్మని తీసుకోవడం వల్ల ఆక్సీడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇది చిన్నతనంలోనే జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది.
కొబ్బరినీరు
కొబ్బరినీరులో కూడా హైడ్రేటింగ్ గుణాలు ఉన్నాయి. కొబ్బరినీటిలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. దీని వల్ల హైడ్రేషన్ పొందుతాం. జుట్టు హెల్దీగా మారడానికి తెల్లబడడాన్ని తగ్గించేందుకు కొబ్బరి నీరు బాగా హెల్ప్ చేస్తుంది.
జ్యూస్ ఎలా చేయాలి
చెప్పిన పదార్థాలన్నింటినీ ముందుగా శుభ్రంగా కడగండి. తర్వాత వీటన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి.
కట్ చేసిన ముక్కలన్నింటిని బ్లెండర్‌లో వేసి మంచి మిక్స్ చేయండి. తర్వాత అందులో నిమ్మరసం పిండండి.
ఇందులోనే పుదీనా ఆకులు వేయండి.
మరికొద్దిగా కొబ్బరినీరు పోస్తే రీఫ్రెషింగ్‌గా ఫీల్ అవుతారు.
వీటన్నింటిని చక్కగా మెత్తగా చేయాలి. జ్యూస్ మరీ చిక్కగా ఉందనిపిస్తే కొద్దిగా నీరు కలుపుకోండి.
ఇష్టం ఉన్నవారు అలానే తాగొచ్చు. లేదంటే వడకట్టి తాగండి.
వడకడితే ఫైబర్, పోషకాలు మత్రం తగ్గుతాయి.
దీనిని అలానే తాగొచ్చు. లేదంటే, ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా తాగొచ్చు.
వారానికి 2, 3సార్లు తాగితే లాభాలు అందుతాయి.