పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తున్నామని,ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణమని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైవీ సుబ్బారెడ్డి సోమవారం(ఫిబ్రవరి3) రాజ్యసభలో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. 150 ఫీట్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశం ఇచ్చారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం టీవల నిర్ణయం తీసుకుంది. 135 ఫీట్లకే ప్రాజెక్టు ఎత్తు పరిమితం చేశారు.ఇది ప్రజల ఆకాంక్షలకు,ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్ధం. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం మౌనంగా మద్దతు తెలిపింది.
ఈ నిర్ణయాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం. 55 వేల కోట్ల రూపాయల అంచనాలకి ఆమోదం తెలపాలి.పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆయకట్టుకు పూర్తిగా నీరు ఉండదు, విశాఖపట్నానికి నీరు అందించే అవకాశం కోల్పోతాం. ఉత్తరాంధ్ర జిల్లాలకు సుజన స్రవంతి నీరు అందదు.పోలవరం కెనాల్స్‌కు సరిపడా నీరు అందదు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని పోలవరం ఎత్తును యథాతథంగా ఉంచాలి అని డిమాండ్ చేసారు.