మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రత తగ్గుముఖం పట్టలేదు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. మధ్యాహ్నం మోస్తరుగా ఎండకాస్తున్నప్పటికీ వాతావరణం శీతలంగానే వుంటున్నది. దీంతో గిరిజనులు యథావిధిగా ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కాగా సోమవారం జి.మాడుగుల, చింతపల్లిలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హుకుంపేటలో 9.6, జీకేవీధిలో 10, అరకులోయలో 10.2, పాడేరులో 10.3, పెదబయలులో 11.6, ముంచంగిపుట్టులో 13.2, డుంబ్రిగుడలో 13.6, కొయ్యూరులో 14.8, అనంతగిరిలో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.