గూగుల్‌కు సంబంధించిన రాబోయే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 9ఏ త్వరలో లాంచ్ చేస్తారనే విషయంలో టెక్ రంగంలో చాలా మంది తెలుసు. ఈ నేపథ్యంలో ఈ వార్తలను నిజం చేస్తూ గూగుల్ పిక్సెల్ 9ఏను సూచించే సర్టిఫికేషన్ ఇటీవల ఓ వెబ్సైట్లో ప్రత్యక్షమైంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15, గూగుల్‌కు సంబంధించిన ఇన్-హౌస్ టెన్సర్ జీ4 ప్రాసెసర్‌తో ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. లీక్‌లు నిజమైతే పిక్సెల్ 9ఏ గూగుల్ ఐ/ఓ 2025 కంటే ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ పిక్సెల్ ఏ-సిరీస్ లైనప్‌లోని తొలిసారి రిలీజయ్యే ఒకటిగా మారుతుంది. ఇటీవల వచ్చిన ఓ టెక్ నివేదిక ప్రకారం గూగుల్ పిక్సెల్ 9ఏ ఫోన్ ఈఎంవీ సీఓ సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించింది. అధికారిక పేరు స్పష్టంగా ప్రస్తావించకపోయినా ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ జీటీఎఫ్7పీని కలిగి ఉందని జాబితా వెల్లడిస్తుంది.
అయితే ఈ జాబితా ప్రకారం పిక్సెల్ 9ఏ ఆండ్రాయిడ్ 15 తో అవుట్-ఆఫ్-ది-బాక్స్ తో లాంచ్ అవుతుందని సూచిస్తుంది. ఇది మేలో గూగుల్‌కు సంబంధించిన వార్షిక ఐ/ఓ ఈవెంట్ కంటే ముందు మార్చి 2025 లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. డిసెంబర్ 2024 నుంచి వచ్చిన లీక్‌లకు అనుగుణంగా గూగుల్ పిక్సెల్ 9ఏకు అనేక ప్రీమియం అప్గ్రేడ్లను తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫీచర్స్ వల్ల ఈ ఫోన్ మిడిల్-రేంజ్ విభాగంలో బలమైన పోటీదారుగా మారుతుంది.
గూగుల్ పిక్సెల్ 9ఏ ఫీచర్స్ ఇవే
6.3 అంగుళాల యాక్టువా డిస్ప్లే, 2,700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్.
గూగుల్ టెన్సర్ జీ4 చిప్సెట్, 8జీబీ + 256 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది.
బ్యాక్ సైడ్ 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా
5,100 ఎంఏహెచ్ బ్యాటరీతో 23 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 7.5 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్.
దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ 68 రేటింగ్.
భద్రత విషయానికి వస్తే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఆకట్టుకుంటుంది.