అరకులోయ మండలంలోని మాడగడలో వైద్య సిబ్బంది ఆధ్వరంలో మంగళవారం క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాడగడ పీహెచ్సీ వైద్యాధికారిణి జ్యోతిస్వరూప మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా చేస్తుందన్నారు. మత్తు పదార్థాలు వద్దు ఆరోగ్యం ముద్దు.. మందు సిగరెట్ వద్దు పౌష్టికారం ముద్దు అంటూ నినాదాలు చేశారు.