ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాను సందర్శించనున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం మోదీ ఉదయం 10:30 గంటలకు ఫిబ్రవరి 5న ప్రయాగరాజ్‌కు చేరుకుంటారు. ఆ క్రమంలో ప్రధాని మహాకుంభమేళాను సందర్శించే సమయంలో ప్రత్యేక పూజలతోపాటు పవిత్ర స్నానం చేయనున్నారని తెలుస్తోంది. ఆయన ప్రయాగరాజ్‌లోని అరయిల్ ఘాట్‌కు చేరుకుని, అక్కడి నుంచి గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం వద్ద పడవ ప్రయాణం చేస్తారు. ఆ క్రమంలో అక్కడి పవిత్ర సంగమ నదుల్లో ఆయన పవిత్ర స్నానం చేయనున్నారు.