శబరిమల శ్రీఅయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రస్తుత మండలం-మకరవిలక్కు సీజన్‌లో రూ.440 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే రూ.86 కోట్లు అధికంగా వచ్చినట్టు సోమవారం ట్రావెంకోర్ దేవసం బోర్డు చైర్మన్ పి.ఎస్. ప్రశాంత్ వెల్లడించారు. గత ఏడాది రూ.354 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. సాధారణంగా ప్రతి ఏడాది సుమారు రూ. 4-5 కోట్ల మేర ఆదాయం పెరుగుతుంటుందని, కానీ ఈ ఏడాది భారీగా పెరిగిందని వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 55 లక్షల మంది భక్తులు వచ్చారని చెప్పారు. నిరుటితో పోల్చితే సుమారు అయిదున్నర లక్షల మంది అధికంగా వచ్చారని తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు రూ.147 కోట్లు ఖర్చయినట్టు వివరించారు.