ప్రకాశం జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు 2024-25 ఆర్థిక సంవత్స రానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 43,050 మందికి సంబంధించి రూ.40,98,23,014 ఇచ్చింది. ఇందులో 11,340 మంది ఎస్సీలకు రూ.12,83,36,691ను వారి ఖాతాకు జమ చేసింది. మిగిలిన ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన నిధులను వారు చదువుతున్న కళాశాలల ఖాతాల్లో వేసింది. ఎంటీఎఫ్ నిధులను మాత్రం విద్యార్థుల ఖాతాలకు జమ చేసింది. ఎస్టీ విద్యార్థులు 1,097మందికి రూ.2,88,75,674, 14,543మంది బీసీ విద్యార్థులకు రూ.10,61,44,667, 10,722 మంది ఈబీసీ విద్యార్థులకు రూ.10,54,81,839, 2,513 ముస్లిం విద్యార్థులకు రూ.2,11,47,464, 2,750మంది కాపు విద్యార్థులకు రూ.1,94,87,254, 35మంది క్రిస్టియన్ విద్యార్థులకు రూ.3,49,425ను కళాశాలల ఖాతాలకు ప్రభుత్వం జమచేసిందని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ తెలిపారు.