గార శాలిహుండాంలోని శ్వేతగిరిపై ఈనెల 12న నిర్వ హించనున్న వేణుగోపాల స్వామి కల్యాణమహోత్సవానికి సంబంధించి మంగళ వారం పందిరిరాట వేశారు.ఏటా ఇక్కడ జరిగే ఉత్సవంలో భాగంగా రథసప్తమి నాడు పందిరి రాట వేసి ఉత్సవాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుగ్గు మధురెడ్డి, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీనరసింహదేవి దం పతులు పూజలు నిర్వహించారు.అలానే.... రణస్థలం పరిధిలోని కమ్మసిగడాం మహాలక్ష్మి అమ్మవారి జాతర ఈనెల ఏడో తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మేరకు మంగళవారం పెళ్లిరాటను ఆలయ ప్రాంగణంలో వేశారు. జాతరకు సంబంధిం చిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు లక్షలకు పైబడి భక్తులు వస్తారని కమిటీ సభ్యులు అంచన వేస్తున్నారు. కార్యక్రమంలో బంటుపల్లి సర్పంచ్ నడుకుదిటి రజిని ఎన్‌ఈఆర్ పాల్గొన్నారు.