ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకే ఓటింగ్ ప్రారంభం కాగా ప్రజలు విరివిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం ఆతిశీ, మాజీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రి జై శంకర్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.