శ్రీకాకుళం జిల్లా అరిసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి జిల్లా అధికారుల కృషి ఎంతో ప్రధానమైందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. 1,20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉత్సవాలు జరగడం ఎంతో శుభసూచకమైన ఘట్టమని బుధవారం ఆయన అన్నారు.