రాజకీయాలలో ఉన్నంతవరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు కార్పోరేషన్ లో వైయస్ఆర్‌సీపీకి మెజారిటీ ఉన్నా స్టాండింగ్ కమిటీలోని ఆరు స్థానాలను కూటమి కైవసం చేసుకుందన్నారు. ఇదేదో అతి పెద్ద విజయం అన్నట్లు అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైయస్ఆర్‌సీపీ ఖాళీ అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. లోపాయికారీ ఒప్పందంతో కొంతమంది కార్పోరేటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పేర్కొన్నారు. మాతో పాటే ఉంటూ కొంతమంది వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారని, క్రాస్ ఓటింగ్ పాల్పడివారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
![]() |
![]() |