తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సులో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కంటే 2019 తరవాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందని తెలిపారు. 2014 నుండి 19 సంవత్సరం తెచ్చిన కంపెనీలను జగన్ తరిమేశారని విమర్శించారు.
2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ అందిస్తోందన్నారు.జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. బూత్ కన్వీనర్లు కేటాయించిన పట్టభద్రులను వ్యక్తిగతంగా కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలిపించాలని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరు పని చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.