ఒకరేమో పెద్దల సభకు పోటీ పడుతున్నారు.. మరొకరమో అసెంబ్లీ బరిలో నిలిచి అదృష్టం పరీక్షించేందుకు టికెట్ దక్కించుకున్నారు. అన్న పెద్దల సభకు.. తమ్ముడు అసెంబ్లీకి పోటీ పడుతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ వారెవరని అనుకుంటున్నారా..! ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు. 2014లో ఆంధ్ర్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నవ్యాంధ్రకు తొలి ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడు నియమితులయ్యారు. అయిదేళ్లపాటు ఆయన అదే పదవిలో కొనసాగారు. ఆయన ఎమ్మెల్సీగా పదవికాలం త్వరలో ముగియనుండటంతో మరోసారి ఆయనకు ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారు. ఆయన గెలిచి మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే కీలకపదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక ఆయన సోదరుడు యనమల కృష్ణుడు కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తుని నుంచి యనమల కృష్ణుడు పోటీ చేయించేందుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కాకినాడ పార్లమెంట్ సమీక్షలో ఈ మేరకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.
గత ఎన్నికల్లోనూ కృష్ణుడు ఇక్కడి నుంచే పోటీ చేసి వైసీపీ చేతిలో ఓడిపోయారు. 2004లో యనమల రామకృష్ణుడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా 2009లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2014లో ఆయన పోటీకి దూరమై సోదరుడు కృష్ణుడుకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కృష్ణుడుకి అవకాశం దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa