పని తీరు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ నెల 6న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తారని పేర్కొన్నారు. 2, 3 స్థానాలు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయిస్తారన్నారు. జిల్లాల 3 పార్లమెంట్ స్థానాలకు కొత్త అభ్యర్థుల పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టడం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa