జాతీయ రహదారులను తరచుగా ఉపయోగించే మధ్య తరగతి మరియు ప్రైవేటు కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టోల్ గేట్ల అపరిమిత వినియోగం కోసం ఏడాది, జీవిత కాలపు టోల్ పాస్‌లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వివరించింది. ముఖ్యంగా ఏడాది టోల్ పాల్ కోసం 3 వేలు రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. జీవిత కాలపు టోల్ పాస్ కోసం 30,000 రూపాయలు చెల్లించాలి. అయితే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రతీ వాహనం యొక్క జీవిత కాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ జీవిత కాలపు పాస్ 15 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
జాతీయ రహదారిపై తరచుగా ప్రయాణాలు చేసే వినియోగదారులకు ఉపశమనం కల్గించేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒకే టోల్ ప్లాజాను దాటడానికి మరియు తరచుగా ప్రయాణించే వారి కోసం నెలవారీ పాస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందాలంటే వినియోగదారులు వారి అడ్రెస్ ప్రూఫ్ సహా మరిన్ని వివరాలను అందింస్తూ.. నెలకు రూ.340 చెల్లంచాల్సి ఉండేది. అలాగే ఈ పాస్‌ను ఏడాది పాటు వాడుకుంటూ పోతే మొత్తంగా రూ.4,080 చెల్లించాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు తీసుకు వచ్చిన కొత్త ఏడాది పాస్ ధర కేవలం 3 వేల రూపాయలు మాత్రమే కాగా.. అందరూ తెగ సంబుర పడిపోతున్నారు. ఒకే టోల్ ప్లాజాకు చెల్లించే డబ్బుల కంటే చాలా తక్కువ డబ్బులతోనే ఏడాది పాటు అపరిమిత టోల్ ప్లాజాలను దాటేందుకు వీలుగా ఈ పాస్ బాగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కార్ల యజమానులకు పాస్‌లు అందించే ప్రణాళికపై తాము పని చేస్తున్నట్లు ఇటీవలే వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని టోల్ ప్లాజాలపై పెరుగుతున్న ఆగ్రహం, 60 కిలో మీటర్ల కంటే తక్కువ వ్యవధిలోనే టోల్ గేట్లు, ప్లాజాలు నిర్మించడంపై ప్రజల్లో తీవ్ర అందోళన వస్తుండగా.. మంత్రిత్వ శాఖ ఈ పాస్‌ల ద్వారా పరిష్కారం చూపబోతుంది.
టోల్ గేట్ల ద్వారా మొత్తంగా 2023-24 సంవత్సరంలో 55 వేల కోట్ల రూపాయలు ఆదాయం లభించగా.. ప్రైవేట్ కార్లు కేవలం రూ.8,000 కోట్ల వాటాను కల్గి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాగే టోల్ ప్లాజాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య దాదాపు 60 శాతం ట్రాఫక్ ప్రైవేట్ వాహనాలదే అయినప్పటికీ.. వాణిజ్య వాహనాల పంపిణీ పగలు, రాత్రి సమానంగా ఉంటుంది. ఈక్రమంలోనే రోడ్డు రవాణా శాఖ ఆ అదిరిపోయే పాస్‌లను అందుబాటులోకి తీసుకు వస్తోంది.