వాలెంటైన్స్ డే సందర్భంగా రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ 2025 పేరుతో ప్రత్యేక సేల్‌ను రియల్‌మి ప్రారంభించింది. సేల్ ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనుందని రియల్‌మి తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతోపాటు స్మార్ట్‌వాచ్, ఎయిర్‌బడ్స్‌ను కూడా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా రూ.10,000 డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ realme.com మరియు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ సహా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. బ్యాంకు ఆఫర్లు, కూపన్ కోడ్స్‌తో డిస్కౌంట్‌లను పొందవచ్చు. దీంతోపాటు EMI ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా రియల్‌మి P1 5G, రియల్‌మి P2 ప్రో 5G, రియల్‌మి GT 6T, రియల్‌మి 13 ప్రో + 5G, రియల్‌మి 14 ప్రో+ 5G, రియల్‌మి 14 ప్రో 5G, రియల్‌మి GT 6, రియల్‌మి GT 7 ప్రో, రియల్‌మి 13+ 5G, రియల్‌మి నార్జో 70 టర్బో 5G, రియల్‌మి నార్జో N65 5G, రియల్‌మి C63 5G స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.