పచ్చి బొప్పాయి కాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలు డ్యామేజ్ అవకుండా రక్షించుకోవచ్చు. బీపీ తగ్గుతుంది. బొప్పాయి కాయలను తింటుంటే షుగర్ లెవల్స్ సైతం తగ్గుతాయి. ఈ కాయల గ్లెసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఫైబర్ ఈ కాయల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్‌ను పెరగకుండా చేస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.