ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 70 శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాల్సి ఉంటుంది.
2015, 2020 ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి సగటున 28 సీట్లతో గెలుపొందుతుందని భావిస్తున్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి ఢిల్లీలో బలమైన పట్టు ఉన్నందున ఇది దానికి పెద్ద ఎదురు దెబ్బ కావచ్చని నిపుణులు అంటున్నారు.