వందేభారత్‌లో ప్రయాణించేవారి కోసం రైల్వే మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో 'ఫుడ్ ఆప్షన్' ఎంచుకోని వారికి కూడా ఇక నుంచి ఆహారం అందించేందుకు ఐఆర్‌సీటీసీ ముందుకొచ్చింది. ఫుడ్ అందుబాటులో ఉండే అప్పటికప్పుడే కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. ప్రయాణికుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.