ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో 12 రోజుల్లో ప్రారంభకానున్న నేపథ్యంలో పాకిస్తాన్‌లో ట్రై సిరీస్ సందడి మొదలైంది. సౌతాఫ్రికా-న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య నాలుగు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. గడాఫీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి నాలుగు మ్యాచ్‌ల ట్రై సిరీస్‌కు పాకిస్తాన్ సిద్ధమైంది. పాక్-సౌతాఫ్రికా-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల ట్రై సిరీస్ జరగనుంది. మూడు జట్లు తలో మ్యాచ్ ఆడనుండగా.. టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్స్ ఆడనున్నాయి. ఈ ట్రై సిరీస్ కోసం లాహోర్, కరాచీ స్టేడియాలు సిద్ధమయ్యాయి.
షెడ్యూల్
ఫిబ్రవరి 8, శనివారం రోజు పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 10, సోమవారం గడాఫీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య ఉదయం 10 గంటలకు రెండో వన్డే, ఫిబ్రవరి 12న పాకిస్తాన్-సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లలో టాప్ 2 ప్లేస్ టీమ్స్ ఫిబ్రవరి 14న కరాచీలో ఫైనల్స్ ఆడనున్నాయి.
పాకిస్తాన్ స్క్వాడ్
బాబర్ ఆజామ్, ఫకర్ జమాన్, సౌద్ షకీల్, తాహీర్, ఫహీమ్ అష్రఫ్, కమ్రాన్ గులామ్, ఖుష్దీ షా, సల్మాన్ అలి అఘ, మహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీశ్ రావూఫ్, మహమ్మద్, నషీమ్ షా, షాహీన్ అఫ్రిది.
సౌతాఫ్రికా స్క్వాడ్
టెంబా బవుమా (కెప్టెన్), ఈథన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, జూనియర్ డాలా, విమాన్ ముల్టర్, మిహ్లాలి మ్పోంగ్వానా, సెనురన్ ముత్తుసామి, గిడియన్ పీటర్స్, మీకా-ఈల్ ప్రిన్స్, జాసన్ స్మిత్, కైల్ వెర్రెయిన్.
న్యూజిలాండ్ స్క్వాడ్
మిచెల్ శాన్‌ట్నర్ (కెప్టెన్), బ్రాస్‌వెల్, మార్క్ ఛాంప్‌మన్, దేవాన్ కాన్వే, లోకీ ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, విల్ ఓరూక్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సీర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, జాకబ్ డప్ఫీ.