ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్-పాక్ తలపడే అవకాశం ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. సెమీస్ కు చేరే జట్లలో భారత్, పాకిస్థాన్‌తో పాటు అఫ్గానిస్థాన్ కూడా ఉండవచ్చని అక్తర్ అభిప్రాయపడ్డారు. అయితే ఫిబ్రవరి 23న భారత్‌పై పాక్ విజయం సాధిస్తుందని భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా మాత్రం సెమీస్‌కు చేరడం కష్టమే అని అక్తర్ వెల్లడించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆతిథ్య పాకిస్థాన్ తమ జెర్సీని ఆవిష్కరించింది. లాహోర్‌లో జరిగిన కార్యక్రమంలో పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్, షహీన్ షా అఫ్రీది తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రమోషనల్ వీడియోను పీసీబీ విడుదల చేసింది. ఈ వీడియోలో పాక్ పురుష క్రికెటర్లే కాకుండా.. మహిళా ప్లేయర్లు ఫాతిమా సనా, సదియా ఇక్బాల్ కూడా ఇందులో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కూడా ఛాంపియన్స్ ట్రోఫీ అధికారిక సాంగ్‌ను రిలీజ్ చేసింది. పాకిస్థానీ ప్లేబ్యాక్ సింగర్ అతిఫ్ అస్లామ్ ఆలపించాడు. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఒక గ్రూప్ కాగా.. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మరో గ్రూప్‌లో తలపడతాయి.
![]() |
![]() |