సోమందేపల్లి మండల కేంద్రంలోని మారుతినగర్, శివానగర్ లో మంత్రి సవిత చొరవతో కరెంట్ కష్టాలు తీరనున్నాయి. శనివారం విద్యుత్ శాఖ అధికారులు కాలనీల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు.
గతంలో కాలనీల ప్రజలు విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా స్పందించిన మంత్రి అధికారులకు ఆదేశాలు ఇవ్వగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తుండటంతో టీడీపీ నాయకులు పనులు పర్యవేక్షించారు.