ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటిమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సింగ్ వర్మ పై ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ సింగ్ వర్మ ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా కేజ్రీవాల్ పై గెలిచిన వెంటనే పర్వేశ్ సింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో సీఎం సీటులో కూర్చునేది పర్వేశ్ సింగ్ వర్మనే సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.