రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఒంటిమిట్ట గ్రామంలోని మాడ వీధులు కోదండ రాముని నామస్మరణతో మారు మోగాయి. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
![]() |
![]() |