తిరుపతి జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతిలోని బైరాగిపట్టెడకు చెందిన లక్ష్మి అనే మహిళ కిరణ్ రాయల్ మీద సంచలన ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కిరణ్ రాయల్ తన వద్ద కోటీ 20 లక్షల రూపాయలు అప్పు తీసుకుని మోసం చేశారని లక్ష్మి ఆరోపించారు. నగలు తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చానన్న లక్ష్మి.. ఇప్పుడు అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తనకు అప్పులు ఇచ్చిన వాళ్ల దగ్గర నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయన్న లక్ష్మి.. తనకు చావే శరణ్యమంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
![]() |
![]() |