బెంగళూరు మెట్రో ఛార్జీలను భారీగా పెంచేసింది. ఫిబ్రవరి 8న ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.90కి పెంచేసింది. స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు మాత్రం 5 శాతం తగ్గింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. పెంచిన కొత్త ఛార్జీలు ఆదివారం (ఫిబ్రవరి 9) నుంచి అమల్లోకి రానున్నాయి. తక్కువ దూరాలకు (0-2 కి.మీ) ఛార్జీని రూ.10 ఉంచగా 30 కి.మీ దాటిన ప్రయాణాలకు గరిష్ట ఛార్జీని రూ.90గా నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa