బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల ఇళ్లు, ఆస్తులపై నిరసనకారులు దాడులు చేస్తున్నారు. ఇళ్లకు నిరసనకారులు నిప్పంటించారు. షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసంపై కూడా దాడి చేశారు. అయితే ఈ హింసకు కారణం షేక్ హసీనా ప్రసంగాలేని తెలుస్తోంది. భారత్‌లో ఉన్న షేక్ హసీనా.. ఇటీవల ఆవామీ లీగ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ప్రసంగించారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ఆమె పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో తనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం.. నిజానికి తనను హత్య చేసేందుకే చేశారని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనను, తన సోదరిని చంపాలని మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్లాన్ చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
![]() |
![]() |