ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూత్రాన్ని నిల్వ చేద్దాం, దిగుమతి ఆపేద్దాం..కేంద్ర మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2019, 07:42 PM

తన ఆలోచనలు అత్యద్భుతంగా ఉంటాయని, అయితే తనకు ఎవరూ సహకరించరని వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.  నాగపూర్‌లో జరిగిన యువ సృజనాత్మక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. మన మూత్రం ద్వారా యూరిన్ తయారు చేయవచ్చని అన్నారు. ‘మానవ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుంది. అందులో సల్ఫేట్, నైట్రోజన్ ఉంటాయి. ప్రజల మూత్రాన్ని నిల్వ చేసుకుంటే విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం రాదు. ఫలితంగా చాలా డబ్బులు మన దేశానికి ఆదా అవుతుంది. దేశవ్యాప్తంగా యూరిన్‌ను నిల్వ చేసుకుంటే.. విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయమై విమానాశ్రయాలలో మూత్రాన్ని నిల్వ చేయమని గతంలోనే నేను కోరాను. కానీ, నా ప్రతిపాదనను ఎవరూ అంగీకరించలేదు.  కార్పొరేషన్‌ కూడా నా మాటలు పట్టించుకోలేదు. సనాతన ఆచారాలను పాటించేవారికి నా అద్భుతమైన ఆలోచనలు నచ్చవు’ అని అన్నారు ఆయన. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్డిగా ఓ పని చేస్తూ వెళ్లేలా శిక్షణ ఇస్తారని, అందుకే వాళ్లూ ఇలాంటి ఆలోచనలను స్వాగతించరని చెప్పారు. అనంతరం మనిషి వెంట్రుకల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వెంట్రుకల నుంచి అమినో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయని, వాటిని కూడా ఎరువుగా ఉపయోగించుకోవచ్చని అన్నారు. వాటిని పంటకు ఎరువుగా వేయడం వల్ల పంట రాబడి మరో 25 శాతం పెరుగుతుందని అన్నారు. 180 కంటైనర్ల జీవ ఎరువులను(బయో ఫెర్టిలైజర్స్) దుబాయ్ నుంచి కొనుగోలు చేస్తున్నామని వాపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa