పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి ఆర్మీ దుస్తుల్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని యమునా విహార్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని మిలిటరీ దుస్తుల్లో వచ్చిన ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తీవారి తీరుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓట్లు అడుక్కోవడానికి ఆర్మీ దుస్తులు వాడుకోవడం సిగ్గుచేటు అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ట్విటర్‌లో మండిపడ్డారు. అలాగే మనోజ్ తివారి చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రివిధ దళాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలుకుతున్నారు. సిగ్గుచేటు. ఓట్లు అడగడానికి మనోజ్ తీవారి ఆర్మీ యూనిఫామ్‌ను వేసుకసున్నారు. బీజేపీ, మోదీ, అమిత్ షా మన జవాన్లను రాజకీయంగా వాడుకొని అవమానిస్తున్నారు. అంతేకాకుండా దేశభక్తి గురించి లెక్చర్లు ఇస్తున్నారు’ అని డెరెక్ ట్వీట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో తీవారి వివరణ ఇస్తూ..‘మన దేశ ఆర్మీ అంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. అందుకే ఆర్మీ దుస్తులు ధరించాను. నేను ఇండియన్ ఆర్మీలో లేకపోయినా.. ఈవిధంగా నా సంఘీభావం తెలియజేశాను. ఇలా చేయడం అవమానించడం ఎలా అవుతుంది? నెహ్రూ జాకెట్ వేసుకుంటే.. జవహర్‌లాల్ నెహ్రూను అవమానించినట్టేనా’ అని తివారీ ట్విటర్‌లో ఎదురు ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa