ట్రెండింగ్
Epaper    English    தமிழ்

45 మంది ఎన్నారై అల్లుళ్ల ఆటకట్టు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2019, 07:48 PM

మీ అమ్మాయిని ఎవరికి ఇస్తున్నారూ అంటే.. ‘మాంచి ఎన్నారై సంబంధం వచ్చింది.. వాళ్లు అడిగినంత కట్నకానుకలు ఇచ్చి చేస్తున్నాం’ అని బడాయిలుపోతూ చెప్పగా విన్నాం. ఇలా చాలా మంది ఎన్నారై సంబంధాలు రాగానే వెనకా ముందు చూసుకోకుండా తమ ఆడబిడ్డలను ఇచ్చి పెళ్లిళ్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. మరి అలా పెళ్లి అయ్యాక ఆ ఎన్నారై అల్లుళ్లు తమ కూతుళ్లను చక్కగా చూసుకుంటున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే ?? అక్కడికి వెళ్లాక అదనపు కట్నం కోసం వేధించడం, వదిలేయడం, లేదంటే తెల్ల తోలు పిల్ల మాయలో పడి వీళ్లను వదిలించుకోవడం వంటివి చేస్తున్నారు. కొందరు మరీ రాక్షసంగా మర్డర్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు పూనుకోవాల్సిందేనని బాధిత కుటుంబాలు మొర పెట్టుకున్నాయి. వారి మొర ఆలకించిన కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ భార్యలను వదిలేసి విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్నారైల పాస్‌పోర్టులు రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆమే వెల్లడించారు.
తరచూ ఇలాంటి ఘటనల్లో చాలా మంది అమ్మాయిలు తీవ్రంగా నష్టపోయారు. ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  అడ్డుకట్ట వేసేందుకు విదేశాంగ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, హోంశాఖ, న్యాయశాఖ సంయుక్తంగా ఓ బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించగా.. రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకునేందుకు ఇంటిగ్రేటెడ్‌ నోడల్‌ ఏజెన్సీను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ఏజెన్సీ భార్యలను విడిచి పెట్టిన ఎన్నారై భర్తలపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు మేనకా గాంధీ వెల్లడించారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa