మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. కుంభమేళా ప్రారంభమై 28రోజులు గడుస్తున్నా.. రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిపోతున్నాయి.
మొత్తంగా దాదాపు 200-300 కి.మీ మేర ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. గంటలపాటు యాత్రికులు వాహనాల్లోనే ఉండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్‌లోనే వేలాది వాహనాలను నిలిపివేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa