వృక్షాలకు, జంతువులకు సంబంధించి శాస్త్ర విజ్ఞానాన్ని యువతలో వ్యాప్తి చేయడానికి సియెన్షియా పేరుతో జంతు వృక్ష జీవ సాంకేతిక శాస్త్ర విభాగాల మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని విజయవాడ నగరంలోని పీబీ సిద్ధార్థ ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించి కళాశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో క్విజ్, పీపీటీ, పోస్టర్ ప్రజంటేషన్, అరుదైన జీవజాల సమాచార ప్రదర్శన ఉంటాయని చెప్పారు. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల నుంచి డిగ్రీకళాశాల విద్యార్థులు ఈ పోటీలకు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీన్ రాజేష్ జంపాల, సీయెన్షియా కో కన్వీనర్ డాక్టర్ సాంబనాయక్, అఽధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa