ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) అనే వ్యక్తి.. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మించి దారుణానికి పాల్పడ్డాడువసతి గృహంలో ఉంటున్న యువతిని ఫంక్షన్ ఉందని ఇంటికి ఆహ్వానించిన హుస్సేన్.. ఇంటికి వెళ్ళేసరికి హుస్సేన్ స్నేహితులు షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25) ఇంట్లో ఉన్నారుఫంక్షన్ జరగట్లేదని గ్రహించిన యువతి హుస్సేన్ ను నిలదీసింది. నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని పిలిచానని చెప్పి నమ్మించి, ఆ తర్వాత బయటకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన హుస్సేన్హుస్సేన్, ప్రభుదాస్ ఇంటి బయట కాపలా ఉండగా.. షేక్ గాలి సైదా గదిలోపలకి వచ్చి నువ్వు హుస్సేన్ దిగిన వ్యక్తిగత ఫోటోలు ఉన్నాయని బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడుఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తూ శారీరకంగా గడపాలని హుస్సేన్, ప్రభుదాస్, గాలి సైదా వేధిస్తున్నారని యువతి తల్లితండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారుకేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
![]() |
![]() |