క్షణికాశంతో విచక్షణ కోల్పోయిన భర్త భార్యపై దాడి చేసిన నేపథ్యంలో ఆమె చనిపోయిందనుకుని అక్కడే వదిలేసి అతడు పోలీసుల వద్ద లొంగిపోయాడు. తీరా స్పృహలోకి వచ్చిన ఆమె తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పొందూరు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరా లను పోలీసులు ఆదివారం తెలిపారు. లైదాం గ్రామానికి చెందిన గొర్లె సాయిప్రసాద్‌కు సంతకవిటి మండలం బలరాంపేటకి చెందిన పావనితో వివాహమైంది. సాయి ఓ ఆన్‌లైన్ కంపెనీలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ.. శ్రీకాకుళం పట్టణంలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. వీరికి ఏడు నెలల కుమారుడు సాత్విక్ ఉన్నాడు. కొద్ది నెలలుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శని వారం భార్యా భర్తలిద్దరూ ద్విచక్రవాహనంపై శ్రీముఖలింగం దైవ దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా కొత్తపేట కూడలిలో గొడవపడ్డారు. దీంతో పావ నిని కన్నవారి ఇంట్లో దింపేందుకు బలరాంపేట ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. ఈ క్రమంలో తాడివలస పీహెచ్‌సీ సమీపంలో ఉన్న తోట వద్దకు వచ్చేసరికి మరోసారి మాటామాటా పెరిగింది. దీంతో సాయి క్షణికా వేశానికి లోనై పావనిపై దాడిచేయడమే కాకుండా చున్నీతో ఆమె మెడకు బిగించడం తో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో పావని చనిపోయిందని భావించిన సాయి.. శ్రీకాకుళం వచ్చేసి ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు లొంగిపో యాడు. ఇదిలా ఉంటే స్పృహ కోల్పోయిన పావనికి కాసేపటికి తెలివి రావడంతో బలరాంపేట వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. తల్లిదండ్రులతో కలిసి ఆదివారం సాయంత్రం పొందూరు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆమె ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సత్యనారాయణ కేసు చేసి ఆమెను పొందూరు సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆదివారం బాధితురాలితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా సాయిప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
![]() |
![]() |