అంతర్జాతీయ టి-20 లీగ్ 2025 లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 9 ఆదివారం రోజున దుబాయ్ క్యాపిటల్స్ – డెసర్ట్ వైపర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన డిసెర్ట్ వైపర్స్ జట్టు 189 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మ్యాక్స్ హుల్టెన్ 51 బంతుల్లో 76 పరుగులు, సామ్ కరణ్ 33 బంతులలో 62 పరుగులు, వికెట్ కీపర్ అజాం ఖాన్ 13 బంతులలో 27 పరుగులు చేశారు. ఇక మిగతా బ్యాటర్లు 10 పరుగులకు మించి రాణించలేదు. దీంతో డెసెర్ట్ వైపర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. దుబాయ్ క్యాపిటల్స్ {Dubai Capitals} బౌలర్లలో ఓబేయ్ మొక్కోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. హైదర్ అలీ, సికందర్ రాజా చెరో వికెట్ పడగొట్టారు. మ్యాక్స్ హోల్టేన్ ఓ విధంగా డెసర్ట్ వైపర్స్ స్కోర్ బోర్డును నిలబెట్టాడు. ఇక అతడు పెవిలియన్ చేరిన అనంతరం శ్యామ్ కరణ్ – అజాం ఖాన్ జోడి చక్కటి భాగస్వామ్యాన్ని అందించారు.
వీరిద్దరూ ఐదవ వికెట్ కి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో డెసెర్ట్ వైపర్స్ జట్టు 189 పరుగుల స్కోర్ చేసింది. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ కాపిటల్స్ {Dubai Capitals} జట్టు.. 19.2 ఓవర్లలోనే ఆరు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వికెట్ కీపర్ షాయ్ హోప్ 39 బంతులలో 43 పరుగులు, రోవ్ మన్ పావెల్ 38 బంతులలో 63, దాసున్ షనకా 10 బంతులలో 21, సికందర్ రాజా 12 బంతులలో 34 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఈ క్రమంలో దుబాయ్ క్యాపిటల్స్ {Dubai Capitals} జట్టు 19.2 ఓవర్లలోనే టార్గెట్ ని చేదించింది. ఇక డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో మహమ్మద్ అమీర్, డేవిడ్ పెయిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కరణ్, నాథన్ సౌటర్ తలో వికెట్ తీశారు. 2023 లో ప్రారంభమైన ఈ టోర్నీ 2023లో ప్రారంభం కాగా.. తొలి సీజన్ లో గల్ఫ్ జెయింట్స్ విజేతగా నిలిచింది.
![]() |
![]() |