కోటబొమ్మాళి పరిధిలోని పట్టుపురం గ్రామానికి చెందిన గుడ్ల రామారావు(55) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రామారావు గతనెల 28న సాయంత్రం భార్య తవిట మ్మకు మద్యం సేవించేందుకు డబ్బులు అడిగాడు. ప్రతిరోజూ ఇలా నేను కూలి చేసి సంపాదించిన డబ్బులతో నీవు మద్యం తాగితే కుటుంబాన్ని ఎలా పోషిస్తామని మందలించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రామా రావు ఇంటి వెనకాల పొలం కోసం ఉంచిన పురుగుల మందును సేవించాడు.
వెంటనే అటుగా వెళుతున్న కుమారుడు చూసి ఆ డబ్బాను తీసి పారవేసి విషయాన్ని తల్లికి చెప్పాడు. వెంటనే అతడిని తొలుత కోటబొ మ్మాళి సామాజిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన వెద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
![]() |
![]() |